Siddharth 'టక్కర్' టీజర్

Tuesday,April 18,2023 - 12:05 by Z_CLU

Siddharth’s bilingual Takkar on May 26; action-packed teaser launched

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధార్థ్ ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ‘టక్కర్’ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన టక్కర్ టీజర్  ఆకట్టుకుంటోంది. “నేనంటే ఇష్టం లేదా”, “లవ్ అంటేనే ఇష్టంలేదు” అంటూ హీరో హీరోయిన్ మాటలతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇక టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.