రీ ఎంట్రీ కి రెడీ అయిన సిద్దార్థ్ !

Sunday,July 21,2019 - 03:02 by Z_CLU

తెలుగులో వరుస ప్రేమకథలతో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న సిద్దార్థ్ ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ‘గృహం’ అనే డబ్బింగ్ సినిమాతో పలకరించిన సిద్దు ఇప్పుడు తెలుగులో  రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజా రవి తేజ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడని సమాచారం.

‘ఆర్ ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి డైరెక్షన్ లో నెక్స్ట్ మహాసముద్రం సినిమా చేయబోతున్నాడు రవితేజ. సిద్దు నటించబోయేది ఈ సినిమాలోనే.  ఇటివలే సిద్దార్థ్ కి కథ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట అజయ్. మరి సిద్దు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తాడో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.