షాకిచ్చిన సిద్దార్థ్

Wednesday,January 30,2019 - 10:06 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు మానేసి కోలీవుడ్ లో బిజీ అయిపోయాడు సిద్దార్థ్ . తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ ఈ హీరో కి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. అయితే ఇటివలే ఓ ఫోటో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు సిద్దు.

ఆ ఫోటో మరేదో కాదు.. పదేళ్ళ ఛాలెంజ్ ఫోటో. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పదేళ్ళ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. సెలెబ్రీటీలందరూ తమ పదేళ్ళ ఫోటోకి ఇప్పటి ఫోటోను జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్ని సంతోష పెడుతున్నారు. అయితే ఆ ఫోటో చూస్తూ తాము అభిమానించే స్టార్స్ లో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు చూసి అవాక్కవుతున్నారు. అయితే సిద్దు మాత్రం  తన పదేళ్ళ  ఫోటో పెట్టి షాక్ ఇచ్చాడు.

నా పదేళ్ళ ఛాలెంజ్ ఇదిగో అంటూ తన పదేళ్ళ క్రితం ‘ఓయ్’ సినిమా స్టిల్ తో ఇప్పటి స్టిల్ ని జత చేసి పోస్ట్ పెట్టాడు. ఇందులో ఆశ్చర్యమేమిటంటే సిద్దు అప్పటి ఫోటో ని ఇప్పటి ఫోటోతో పోల్చేలా ఉంది. అప్పటి కంటే ఇప్పుడే యంగ్ గా కనిపిస్తూ అందరినీ షాక్ చేసాడు సిద్దార్థ్. ఏదేమైనా పోల్చుకోలేనంతగా ఫిజిక్ ను మైంటైన్ చేస్తున్న సిద్దు ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.