హీరోయిన్... పెళ్ళి అయిపోయింది!

Saturday,December 15,2018 - 10:02 by Z_CLU

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యూత్ కి దిల్ కీ ధడ్కన్ అనిపించుకున్న శ్వేత బసు ప్రసాద్ పెళ్లైపోయింది. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడీ ఫోటోస్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి.

పూణే లో బెంగాలీ ట్రెడిషన్ లో జరిగిన ఈ పెళ్ళి వేడుకలకు ముందు శ్వేత బసు ప్రసాద్ బాలి లో ఫ్రెండ్స్ తో బ్యాచిలర్ పార్టీ సెలెబ్రేట్ చేసుకుంటుంది. గత కొన్ని రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్న రోహిత్, శ్వేతలు బెంగాలీ ట్రెడిషన్ లో జరిగిన పెళ్ళితో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే, T.V. సీరియల్స్ తో కరియర్ ని సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకుంటున్న శ్వేత బసు ప్రసాద్, పెళ్ళి తరవాత కూడా యాక్టింగ్ కరియర్ ని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉంది.