అదీ శృతి హాసన్..!!

Friday,June 21,2019 - 10:02 by Z_CLU

ఈ మధ్య సినిమాలు తగ్గించేసింది ఇక నటించదా..? అనుకున్నారు. మ్యూజికల్ ట్రూప్స్ లో బిజీగా ఉంటుంది ఇకపై సింగర్ గానే సెటిలవుతుందా…? అనే టాక్ కూడా నటించింది. కానీ శృతి హాసన్ మైండ్ లో ఇంకేదో నడిచింది. టాలీవుడ్… బాలీవుడ్ తరవాత ఏకంగా శృతి హాసన్ ఫిక్స్ చేసుకున్న టార్గెట్  ‘హాలీవుడ్’.. ఇది మాత్రం ఎవరూ గెస్ చేయలేకపోయారు.

‘ట్రెడ్ స్టోన్’ అనే హాలీవుడ్ సిరీస్ లో చాన్స్ కొట్టేసింది శృతి హాసన్. ఈ సిరీస్ లో ఢిల్లీ బేస్డ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ లా కనిపించనుంది. ఈ సిరీస్ తో గ్లోబల్ ఆడియెన్స్ కి కూడా ఇంట్రడ్యూస్ కానుంది శృతి హాసన్.

CIA (సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) డ్రామాలో శృతితో పాటు మరికొంతమంది హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారు. ఈ సిరీస్ లో నీరా పాటల్ అనే రోల్ లో కనిపించనుంది శృతి. ఓ సెక్రెట్ మిషన్ లో భాగంగా ఒక హోటల్ లో వెయిట్రస్ గా కనబడే క్యారెక్టర్ శృతి హాసన్ ప్లే చేయనుంది.  

ఇప్పటి వరకు బాలీవుడ్ నుండి మాత్రమే హీరోయిన్స్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. సౌత్ నుండి మాత్రం హాలీవుడ్ లో లాంచ్ కానున్న ఫస్ట్ ఎవర్ హీరోయిన్ శృతి హాసన్. ఈ సిరీస్ గనక సక్సెస్ అయితే, శృతి ఆల్మోస్ట్ హాలీవుడ్ లో సెటిలయిపోయినట్టే…