లాక్ డౌన్ ఉన్నా లేకున్నా నాకు ఒక్కటే

Thursday,August 06,2020 - 05:34 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా ఇళ్లకే ఫిక్స్ అయ్యారు. ముఖానికి మేకప్ వేసుకొని కొన్ని నెలలైంది. సెట్స్ ను మాత్రమే కాదు, పార్టీల్ని కూడా మిస్ అవుతున్నారు చాలామంది సెలబ్రిటీస్. అయితే ఈ విషయంలో తనకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదంటోంది హీరోయిన్ శృతిహాసన్.

పార్టీలకు సంబంధించి లాక్ డౌన్ ఉన్నా, లేకున్నా తనకు ఒకటే అంటోంది శృతిహాసన్. తను ఎక్కువగా ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుందట. పార్టీలకు పెద్దగా వెళ్లదంట. సో.. ఈ లాక్ డౌన్ టైమ్ లో పార్టీలు మిస్ అవుతున్నాననే బాధ తనకు ఏమాత్రం లేదంటోంది.

మరోవైపు ఈ లాక్ డౌన్ వల్ల ఎవ్వర్నీ పెద్దగా మిస్ అవ్వలేదని కూడా చెబుతోంది. తనకు కావాల్సిన వ్యక్తులందరితో ఫోన్, సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉన్నానని చెబుతోంది.

మొత్తమ్మీద శృతిహాసన్ పై లాక్ డౌన్ ప్రభావం పెద్దగా లేనట్టుంది.