శృతి హాసన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,March 21,2017 - 08:09 by Z_CLU

కాటమరాయుడు ఈ వీకెండ్ కి రిలీజ్ కానుంది. ఈ దాంతో పాటు పవర్ స్టార్ కూడా 20 ఇయర్స్ టాలీవుడ్ లో కంప్లీట్ చేసుకున్న సందర్భంగా శృతి హాసన్ ఎక్స్ క్లూజివ్ గా పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది.

గబ్బర్ సింగ్ సినిమా చాలా చాలా స్పెషల్

గబ్బర్ సింగ్ సినిమా టైం లో నిజానికి చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. గబ్బర్ సింగ్ కి ముందు సినిమాలు చేసినా అప్పటికీ నా కరియర్ ట్రాక్ లో పడలేదు. తెలుగు సినిమాలు చేయాలా..? తమిళ సినిమాలు చేయాలా..? లేకపోతే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలా..? ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పడింది గబ్బర్ సింగ్. డెఫ్ఫినేట్ గా ఆ సినిమా నా కరియర్ కి చాలా స్పెషల్.

 

పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ స్టార్ కాదు

పవన్ కళ్యాణ్ గారు జస్ట్ సినిమా మనిషి కాదు, సినిమాల కన్నా ఎక్కువగా జనరల్ టాపిక్స్ పై ఎక్కువగా మాట్లాడతారు. డిఫెరెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తారు. మనుషులు, గవర్నమెంట్, సమస్యలు… ఆయన మైండ్ లో ఇవే తిరుగుతుంటాయి ఎక్కువగా.

ఎక్కువగా మాట్లాడరు

బేసిగ్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే అందులో డెఫ్ఫినేట్ గా జెన్యూనిటీ ఉంటుంది.

నేను మారాను కానీ ఆయన మారలేదు

గబ్బర్ సింగ్ తరవాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కాటమరాయుడు చేశాను. ఈ గ్యాప్ లో ఇన్ ఫాక్ట్ నేను మారాను కానీ ఆయన ఏమీ మారలేదు. అదే కైండ్ నెస్, అదే ఆటిట్యూడ్.

ఇలాంటి 20 ఇయర్స్ ఎన్నో సెలెబ్రేట్ చేసుకోవాలి

పవర్ స్టార్ గారి ఈ ట్వంటీ ఇయర్స్ కరియర్ జర్నీ ఆయనకే కాదు అందరికీ చాలా స్పెషల్. ఇలాంటి 20 ఇయర్స్ ఎన్నో కంప్లీట్ చేసుకోవాలని, సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నా.