Mega154 చిరుకి హీరోయిన్ ఫిక్స్

Tuesday,March 08,2022 - 07:20 by Z_CLU

Shruti Haasan to romance with Megastar Chiranjeevi in ‘Mega154’

ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు. అందులో బాబీ సినిమా ఒకటి. Mega154 గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకి కొందరు హీరోయిన్స్ పేర్లు చక్కర్లు కొట్టగా ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ లోకి శృతి హాసన్ వచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ బాలకృష్ణ తో ఒక సినిమా ప్రభాస్ తో ‘సలార్’ చేస్తుంది. తాజాగా మెగా ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా సెట్ లో శృతి హాసన్ కి వెల్కం చెప్తూ మెగాస్టార్ , దర్శకుడు బాబీ ఆమెకి బొకే అందించారు. ఉమెన్స్ డే స్పెషల్ గా శృతి ఆన్ బోర్డ్ అంటూ హీరోయిన్ ని ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా మేటర్ రివీల్ చేశారు. ప్రస్తుతం చిరు, శృతి హాసన్ లపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

 మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు మాస్ లుక్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే వదిలిన ప్రీ లుక్ పోస్టర్స్  సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తూ మెగా స్టార్ గురించి డిస్కషన్ కి తెరతీశాయి. కోనా వెంకట్ , చక్రవర్తి స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics