ఎట్టకేలకు సెట్స్ పైకి శృతిహాసన్

Wednesday,October 30,2019 - 12:30 by Z_CLU

2017లో వచ్చిన కాటమరాయుడు తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. అలా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శృతిహాసన్, ఎట్టకేలకు మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది. మరోసారి రవితేజ సరసన నటించనుంది.

మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాను దీపావళి సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. గతంలో రవితేజ-శృతిహాసన్-గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బలుపు సినిమా వచ్చింది.

పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ ఉంటుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.