Shruti Haasan Salaar - ఇది ఫిక్స్

Thursday,January 28,2021 - 02:04 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…
బ్యూటిఫుల్ హీరోయిన్ శృతిహాసన్…
వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ఫిక్స్ అయింది. పాన్-ఇండియా మూవీ సలార్ లో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈరోజు శృతిహాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందిస్తూ.. సలార్ లో శృతిహాసన్ ఎంట్రీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

నిజానికి ఈ సినిమా కోసం ముందుగా కత్రినాకైఫ్ ను, ఆ తర్వాత దిశా పటానీని ట్రై చేసింది యూనిట్. వాళ్ల కాల్షీట్లు ఎడ్జెస్ట్ అవ్వకపోవడంతో శృతిహాసన్ ను తీసుకున్నారు.

వచ్చే నెల నుంచి సలార్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోంది ఈ భారీ బడ్జెట్ మూవీ.