Shruti Haasan - EMI కట్టడానికి డబ్బుల్లేవ్!

Tuesday,May 11,2021 - 05:15 by Z_CLU

సెలబ్రిటీలకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా..? ఒకవేళ ఉన్నప్పటికీ అవి కోట్ల రూపాయల్లో ఉంటాయి? మరీ ఈఎంఐ కట్టలేని పొజిషన్ లో కూడా ఉంటారా? ఎందుకుండరు.. శృతిహాసనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ దగ్గర డబ్బుల్లేవు. ఆమె ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. ఎంతలా అంటే నెలనెలా ఇంటి ఈఎంఐ కట్టడానికి కూడా ఆమెకు ఇబ్బందిగా ఉందంట. ఈ విషయాన్ని శృతిహాసనే స్వయంగా చెబుతోంది.

Shruti_haasan_white_saree_stills-zeecinemalu 2

చీర కట్టులో శృతిహాసన్

“లాక్ డౌన్ టైమ్ లో చాలామంది స్మార్ట్ గా ఉన్నారు. కానీ నేను అలా ఉండలేకపోయాను. లాక్ డౌన్ కు ముందు ముంబయిలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్నుంచి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. ఓవైపు షూటింగ్స్ లేవు, మరోవైపు నెలనెలా భారీగా ఈఎంఐ కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతానికైతే ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాను.”

ఇలా తన ఆర్థిక పరిస్థితిని బయటపెట్టింది శృతిహాసన్. షూటింగ్స్ లేకపోవడం వల్లనే డబ్బుల్లేవని, షూటింగ్స్ స్టార్ట్ అయితే ఆటోమేటిగ్గా డబ్బులు వస్తాయని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు తండ్రి కమల్ హాసన్ ను డబ్బులు అడగనని కూడా చెబుతోంది.

లైఫ్ లో ప్రతి నిర్ణయం సొంతంగా తీసుకుందట శృతిహాసన్. ఇల్లు కొనాలనే నిర్ణయం కూడా సొంతంగానే తీసుకున్నానని, కాబట్టి.. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ను కూడా సొంతంగానే ఫేస్ చేస్తానని చెబుతోంది ఈ హీరోయిన్. తండ్రి, తల్లి సహాయం మాత్రం కోరనంటోంది.

shruti haasan

Actress-ShrutiHaasan-Stills-ZeeCinemalu

శృతిహాసన్ లాంటి హీరోయిన్ కు కూడా డబ్బులకు ఇబ్బందిగా ఉందంటే కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. కానీ ఇదే నిజం. కరోనా ప్రభావం శృతిహాసన్ పై కూడా పడిందన్నమాట.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics