Chiranjeevi - మెగాస్టార్ సరసన మరో క్రేజీ బ్యూటీ?

Sunday,December 05,2021 - 03:21 by Z_CLU

బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేయలేదు. మూవీ సెట్స్ పైకొచ్చింది కాబట్టి హీరోయిన్ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

తెలుగులో సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది శృతిహాసన్. క్రాక్, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో మాత్రమే నటించింది. రీసెంట్ గా బాలయ్య-గోపీచంద్ మలినేని ప్రాజెక్టులో నటించేందుకు అంగీకరించింది. ఇప్పుడు చిరంజీవి సరసన కూడా నటించే అవకాశం ఉంది. సీనియర్ల సరసన నటించడానికి చాలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ దాదాపు రేసు నుంచి తప్పుకుంది. దీంతో శృతిహాసన్ కు డిమాండ్ పెరిగింది.

భోళాశంకర్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు. కాబట్టి మళ్లీ ఆమెను రిపీట్ చేయలేదు. పోనీ నయనతారను తీసుకుందామంటే, గాడ్ ఫాదర్ సినిమాలో ఆమె ఆల్రెడీ నటిస్తోంది. కాజల్ ను మరోసారి కన్సిడర్ చేద్దామంటే ఆమె సినిమాలు తగ్గిస్తోంది. అందుకే శృతిహాసన్ వైపు సీనియర్లు దృష్టిపెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

shruti haasan