శృతి హాసన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ...

Friday,October 14,2016 - 06:00 by Z_CLU

‘ప్రేమమ్’ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తున్న శృతి హాసన్ ప్రేమమ్ సక్సెస్ సాధించిన సందర్బంగా  మీడియా తో ముచ్చటించింది. ఆ విశేషాలు శృతి మాటల్లోనే..

 har_2756

ఒరిజినల్ ‘ప్రేమమ్’ బాగా నచ్చింది…

‘ప్రేమమ్’ ఒరిజినల్ చూసాను. డైరెక్టర్ చందు నన్ను కలిసి ప్రేమమ్ రీమేక్ లో మలర్ క్యారెక్టర్ కి మీరైతే బాగుంటుందని అనుకుంటున్నాం అని చెప్ప గానే వెంటనే ఓకే అనేశా. ఒరిజినల్ సినిమా చాలా బాగా నచ్చింది చందు కూడా ఆ ఫ్లేవర్ చేంజ్ చెయ్యకుండా తెలుగు లో అంతే అందంగా తీసాడు. రిలీజ్ తరువాత తెలుగు లో ‘ప్రేమమ్’ కు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ గా ఫీలవుతున్నా. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్స్..

 

నేను అలాంటి దాన్ని కాదు..

కెరీర్ స్టార్టింగ్ నుండి ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకున్నా. కొంత మంది ఆఫర్స్ వస్తే చాలనుకుంటారు కానీ నేను అలాంటి దాన్ని కాదు. ప్రతి సారి కొత్త క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చెయ్యాలనుకుంటా. అందుకే చందు ఈ సినిమాలో సితార క్యారెక్టర్ చెప్ప గానే నేను ఇప్పటి వరకూ చెయ్యని డిఫరెంట్ టీచర్ క్యారెక్టర్ కాబట్టి ఏం ఆలోచించకుండా ఓకే అనేశా..

 

అలా నటించడమే ఇష్టం…

ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించాను. అలా నటించడమే నాకిష్టం. ఇలాంటి సాఫ్ట్ డిగ్నిఫై క్యారెక్టర్స్ కి అదే కరెక్ట్ కూడా. అందుకే సితార క్యారెక్టర్ మేకప్ లేకుండా చేశా. ఈ విషయం లో మా డి.ఓ.పి గారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. మేకప్ లేకపోయినా నన్ను చాలా అందంగా చూపించారు. నన్నే కాదు అందరినీ చాలా అందంగా చూపించారాయన.

har_2746

అతను నాకు మంచి ఫ్రెండ్…

నాగ చైతన్య నేను ఈ సినిమా కి ముందే మంచు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. చైతు తో కలిసి ఈ సినిమా చెయ్యడం ఓ ఫ్రెండ్ తో పిక్నిక్ లా అనిపించింది.

నాన్న గారితో త్వరలోనే సెట్స్ పైకి..

ప్రస్తుతం నాన్న గారి ఆరోగ్యం బాగానే ఉంది. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. కొన్ని రోజులు రెస్ట్ తరువాత మళ్ళీ ‘శెభాష్ నాయుడు’ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఆ సినిమా ద్వారా నాన్న గారితో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఓ మోడరన్ గర్ల్ క్యారెక్టర్ చేస్తున్నా.
ఆ సినిమాలో నటిస్తూ నాన్న నుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నా.

మరో సారి పవర్ స్టార్ తో నటించడం వెరీ హ్యాపీ..

కాటమరాయుడు ఫస్ట్ డే షూట్ చాలా సంతోషాన్ని కలిగించింది. పవన్ గారితో ఇది రెండో సినిమా ఆయన తో నటించిన ‘గబ్బర్ సింగ్’ నాకు హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తో పాటు వరుస ఆఫర్స్ కూడా అందించింది. ఓ మంచి సింపుల్ విల్లేజ్ క్యారెక్టర్ చేస్తున్నా. మళ్ళీ ఆయన తో నటిస్తున్న ఈ సినిమా కూడా మరో సారి నాకు నటిగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా.

 har_2781

అలాంటి కథ దొరికితే చేస్తా.

లేడి ఓరియెంటెడ్ సినిమా చెయ్యాలని ఉంది. కానీ అందుకు మంచి కథ కుదరాలి. నాకు నచ్చిన అలాంటి కథ దొరికి ఎవరైనా చెప్తే ఖచ్చితంగా చేస్తా.

 

త్వరలోనే నిర్మాతగా..

ఎప్పటి నుండో ప్రొడ్యూస్ చెయ్యాలని ఉంది. త్వరలోనే ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తా.

 

త్వరలోనే అనౌన్స్ చేస్తాను..

తెలుగులో అలాగే బాలీవుడ్ లో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కాటమరాయుడు,సింగం-3 , శెభాష్ నాయుడు సినిమాలు మాత్రమే చేస్తున్నా. త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాను..