Shruti Haasan - ప్రమోషన్లకు దూరం

Thursday,January 07,2021 - 12:44 by Z_CLU

సినిమాలకు ప్రమోషన్ ఇచ్చే వాళ్లలో అందరికంటే ముందుంటారు హీరోయిన్లు. ఇలా చేయడం వల్ల మీడియాలో వాళ్లకు ఎక్స్ ట్రా మైలేజీ వస్తుంది. ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్ దక్కుతుంది. కానీ నయనతార లాంటి కొంతమంది హీరోయిన్లు మాత్రం సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. ఇప్పుడీ లిస్ట్ లోకి శృతిహాసన్ (Shruthi Haasan) కూడా చేరిపోయింది.

అవును.. క్రాక్ (KRACK) సినిమా ప్రచారానికి దూరంగా ఉంది శృతిహాసన్. నిజానికి ఈ సినిమా ఆమెకు తెలుగులో రీఎంట్రీ మూవీ. అలాంటప్పుడు మరింత ఎక్కువగా ప్రమోషన్ చేయాలి. కానీ శృతిహాసన్ మాత్రం ఎందుకో సైలెంట్ అయిపోయింది.

ఈ విషయంలో మేకర్స్ కూడా శృతిహాసన్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. చివరికి హీరో రవితేజ కూడా మీడియా ముందుకొచ్చి, ప్రచారం చేశాడు. కానీ శృతిహాసన్ జాడ మాత్రం లేదు.

మూవీ ప్రమోషన్ కు ఈరోజు, రేపు మాత్రమే టైమ్ ఉంది. ఈ 2 రోజుల్లో ఆమె ప్రమోషన్ కు వస్తుందేమో చూడాలి.