ఎట్టకేలకు సినిమా స్టార్ట్ చేసింది

Saturday,April 21,2018 - 01:23 by Z_CLU

ఇక సినిమాలు చేయదనుకున్నారు. బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని భావించారు. గ్యాప్ లో మ్యూజిక్ ఆల్బమ్స్ కు మాత్రమే పరిమితం అయిపోతుందని ఫిక్స్ అయ్యారు. కానీ అవన్నీ పుకార్లని తేలాయి. శృతిహాసన్ కొత్త సినిమా ప్రారంభమైంది.

మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభమైంది. విద్యుత్ తో శృతికి ఇది రెండో సినిమా కావడం విశేషం. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి పేరు తీసుకొస్తుందని అంటోంది శృతిహాసన్.

సినిమా స్టార్ట్ అయిన విషయాన్ని శృతిహాసన్ స్వయంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మపై షికారు చేసిన పుకార్లన్నీ అబద్ధాలని తేలిపోయాయి. ఇదే ఊపులో ఆమె తెలుగులో కూడా ఓ సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాటమరాయుడు తర్వాత ఆమె మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించలేదు.