పెళ్ళి విషయంలో రియాక్ట్ అయిన శృతిహాసన్

Friday,January 04,2019 - 11:31 by Z_CLU

శృతిహాసన్ కరియర్ లో కొంచెం స్పీడ్ తగ్గిన మాట వాస్తవమే. అలాగని ఖాళీగా ఏ మాత్రం లేదు. అటు తమిళంలో టి.వి. షో చేస్తూ, మరికొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగానే ఉంటుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తన యూరోపియన్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోస్ షేర్ చేసేసరికి, ఈ ఇయర్ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం గ్యారంటీ అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. అయితే ఈ విషయంలో రియాక్ట్ అయింది శృతి హాసన్.

వీళ్ళిద్దరి మధ్య అందరూ అనుకుంటున్నట్టు రిలేషన్ షిప్ ఉందా..? లేదా..? అనే పాయింట్ ని శృతి పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఈ ఇయర్ పెళ్ళి అన్నదానికి మాత్రం రియాక్ట్ అయింది. ‘ఈ విషయం నాకు కూడా న్యూసే’ అంటూ ట్వీట్ చేసి, ఇది జస్ట్ రూమర్ మాత్రమే అని కన్ఫమ్ చేసింది.

‘కాటమరాయుడు’ సినిమా తరవాత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు శృతి హాసన్. కమల హాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శభాష్ నాయుడు’ లో కీ రోల్ ప్లే చేస్తున్నా, ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. మరి శృతి సంతకం చేయబోయే నెక్స్ట్ సినిమా ఏ స్టార్ హీరో సరసన ఉండబోతుందో చూడాలి.