హాట్ టాపిక్: అటు ఇలియానా.. ఇటు శృతిహాసన్

Wednesday,March 11,2020 - 12:38 by Z_CLU

పవన్ వకీల్ సాబ్ సినిమా ఒక ఎపిసోడ్ మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఇదే ఊపులో దాన్ని కూడా పూర్తిచేయాలనుకున్నారు. కానీ కాస్త లేట్ అవుతోంది. దీనికి కారణం హీరోయిన్ సెలక్షన్.

ఈ సినిమాకు సంబంధించి పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ఓ హీరోయిన్ కావాలి. ఆ హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. మొన్నటివరకు శృతిహాసన్ పేరు వినిపించింది. ఇప్పుడు తాజాగా ఇలియానా వచ్చి చేరింది. వీళ్లిద్దర్లో ఎవరో ఒకర్ని ఫిక్స్ చేయాలనేది దిల్ రాజు ఆలోచన.

గతంలో వీళ్లిద్దరూ పవన్ తో నటించారు. పవన్-ఇలియానా కలిసి జల్సా సినిమా చేశారు. ఇక పవన్-శృతిహాసన్ కలిసి కాటమరాయుడు సినిమా చేశారు. సో.. పవన్ ఎవర్ని రిపీట్ చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్.

మరోవైపు ఈ సెలక్షన్ కు సంబంధించి డెడ్ లైన్ కూడా ఫిక్స్ అయింది. మార్చి 21 నుంచి పవన్ మళ్లీ కాల్షీట్లు ఇచ్చాడు. అప్పట్లోగా హీరోయిన్ ను డిసైడ్ చేయకపోతే కాల్షీట్లు వేస్ట్ అయిపోతాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ తో టోటల్ మూవీ కంప్లీట్ అవుతుంది.