బిజీ బిజీ శృతిహాసన్

Thursday,February 23,2017 - 11:47 by Z_CLU

సూపర్ ఫాస్ట్ పేజ్ లో ఉంది శృతి హాసన్ కరియర్. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో పవర్ స్టార్ తో రొమాంటిక్ ఎలిమెంట్స్ లో యాక్ట్ చేస్తున్న శృతి, కాటమరాయుడు సినిమా కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్, కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అని కాన్ఫిడెంట్ గా ఉంది.

స్క్రీన్ పై తన సిజిలింగ్ పర్ఫామెన్స్ తో ఎట్రాక్ట్ చేసే శృతి హాసన్ యాక్టింగ్ కరియర్ పట్ల ఎంత ఫోకస్డ్ గా ఉందో, మ్యూజిక్ కరియర్ పట్ల కూడా అంతే సీరియస్ గా ఉంది. 2017 లో మ్యూజిక్ కరియర్ ని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్న ఈ మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్, అటు బాలీవుడ్ లోను ‘బెహెన్ హోగీ తేరీ’ సినిమాతో ‘మే’ లో హంగామా చేయనుంది.

ఒక ఇంటర్వ్యూలో కాటమ రాయుడు గురించి మాట్లాడుతూ ‘వీరమ్’ సినిమాకి రీమేకే అయినా, తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చేంజెస్ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో సరికొత్తగా చూస్తాం అని చెప్పుకుంది. ఇక శభాష్ నాయుడు గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో తన కాంబినేషన్ లో ఉండే మ్యాగ్జిమం సీన్స్ ఆల్ రెడీ షూట్ అయిపోయాయి, మహా అయితే ఇంకా కొన్ని బ్యాలన్స్ ఉన్నాయి. కమల్ హాసన్ సెట్స్ పైకి వచ్చిన నెక్స్ట్ మూమెంట్, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అయిపోతుంది. అని తన బిజీ బిజీ కరియర్ ప్లానింగ్స్ ని వరసగా చెప్పుకుంది శృతి హాసన్.