ఆ సినిమాలో శ్రియ స్పెషల్ సాంగ్

Tuesday,May 02,2017 - 11:30 by Z_CLU

గతంలో ‘దేవదాసు’,’మున్నా’,’తులసి’,’పులి’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేసిన హాట్ బ్యూటీ శ్రియ… లేటెస్ట్ గా మరో స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే బాలకృష్ణ 100 వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో కథానాయికగా అలరించిన శ్రియ.. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట.

స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఈ సాంగ్ శ్రియ చేస్తేనే బాగుంటుందని భావించిన కృష్ణవంశీ… సాంగ్ సిచ్యువేషన్ తో పాటు సాంగ్ ను కూడా శ్రియకు వినిపించాడట. సాంగ్ నచ్చడంతో డేట్స్ కేటాయించిందట శ్రియ. ఈ వారంలోనే ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుంది.