ఎఫైర్ పై క్లారిటీ

Wednesday,October 19,2016 - 01:26 by Z_CLU

రూమర్లకు పెద్దగా రూల్స్ ఏమీ ఉండవు. అందుకే వేగంగా స్ప్రెడ్ అయిపోతాయి. మొన్నటికి మొన్న క్రికెటర్ బ్రావో, శ్రియ ఇద్దరు ముంబయిలోని ఓ హోటల్ లో లంచ్ చేశారో  లేదో వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని పుకార్ల మొదలైపోయింది.

thumb-ex-heroine-of-tollywood-shriya-sharansocial-mediawest-indies-cricketer-bravowest-indies-cricketer

సాధారణంగా ఇలాంటి రూమర్లకు ఈ మధ్య స్టార్స్ కూడా పెద్దగా స్పందించడం లేదు. కానీ శ్రియ మాత్రం ఈ రూమర్స్ పై కాస్త ఘాటుగానే స్పందించింది. న్యూజెర్సీ లో ఒక లైవ్ షో కోసం వెళ్తున్న శ్రియ, తనపై వస్తున్న ఈ రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదని, బ్రావో కి తనకు మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని చెప్తూనే… తను పక్కా సింగిల్ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ… క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తోంది.

cswfljfxeaatvnz