శ్రియ పెళ్లి ఫిక్స్.. ఉదయ్ పూర్ లో వివాహం

Tuesday,February 27,2018 - 05:04 by Z_CLU

మొన్నటివరకు పుకార్లకే పరిమితమైన శ్రియ పెళ్లి ఇప్పుడు నిజమైంది. ఆమె పెళ్ళికి డేట్ ఫిక్స్ అయింది. రష్యా వ్యాపారవేత్త, క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ ను శ్రియ పెళ్లాడనుంది. ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో మార్చి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు ఘనంగా వీళ్ల పెళ్లి జరగనుంది.

రీసెంట్ గా రష్యాలోని ఆండ్రీ ఫ్యామిలీని కలిసిన శ్రియ కుటుంబసభ్యులు వివాహానికి డేట్స్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. అయితే అప్పట్లో ఆ విషయాన్ని శ్రియ తల్లి తోసిపుచ్చారు. కానీ అదే నిజమైంది.

 

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన శ్రియ సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.  ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలో నటిస్తున్న శ్రియ, పెళ్ళి తర్వాత సినిమాల్లో కొనసాగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.