శ్రియ శరన్ ఇంటర్వ్యూ

Monday,January 29,2018 - 03:08 by Z_CLU

డా. మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ ఫిబ్రవరి 9 న రిలీజవుతుంది. మదన్ రామిగాని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మంచి విష్ణు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. విష్ణు సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి శ్రియ ఇంట్రెస్టింగ్ విషయాలు చేర చేసుకుంది ఆ విషయాలు మే కోసం… 

అదే నా క్యారెక్టర్…

సినిమాలో నా క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇన్నోసెంట్ గా ఉంటుంది. అలాగే తెలివైన అమ్మాయి కూడా. తనకేది అనిపిస్తే అదే చేస్తుంది. అల్టిమేట్ గా స్వతంత్రంగా ఆలోచించగలిగే అమ్మాయి.

 

అందుకే చేశాను….

మదన్ గారు క్యారెక్టర్ చెప్పినప్పుడే నచ్చేసింది. చాలా బాగా రాశారు ఆ క్యారెక్టర్ ని. అంతే కాకుండా మోహన్ బాబు గారి లాంటి లెజెండ్ తో పని చేసే అవకాశం వచ్చినప్పుడు డెఫ్ఫినేట్ గా యస్ అనే చెప్తాము. దాంతో పాటు మదన్ నాకు ‘సంతోషం’ సినిమా అప్పటి నుండి తెలుసు. అలా అన్నీ కుదిరాయి ఈ సినిమాకి.

నేను మ్యానేజ్ చేయను…

ఇన్నేళ్ళ కరియర్ ఇంత సక్సెస్ ఫుల్ గా ఉందంటే నేను దాని కోసం పర్టికులర్ గా మ్యానేజ్ చేయడం అలా ఏమీ ఉండదు. నేను చాలా నార్మల్ గా ఉంటాను.

వాయిస్ ఉండాలి…

హీరోయిన్స్ కి మంచి క్యారెక్టర్స్ రాయాలి. సినిమాలో మంచి క్యారెక్టర్ ఉండి కాసేపు కనిపించినా చాలు, కొన్ని సినిమాల్లోలా సినిమా మొత్తం హీరో వెంట పడుతూ 5, 6 పాటల్లో డ్యాన్స్ చేసేసి, సోల్ లేని క్యారెక్టర్ లో కనిపించే కంటే, స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కాసేపు నటించినా చాలు.

 

డ్యాన్స్ చాలా నేర్పిస్తుంది…

మనం డ్యాన్స్ నేర్చుకుంటే అది మనకు చాలా నేర్పిస్తుంది. డ్యాన్స్ మనకు పేషెన్స్ నేర్పుతుంది. రెస్పెక్ట్ దొరుకుతుంది… ప్రతి స్టెప్ ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ లో షార్ప్ నెస్ పెరుగుతుంది… నేను డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు మా అమ్మ రోజు నా చేయి పట్టుకుని తీసుకువెళ్ళేది. నేను కథక్ నేర్చుకున్నాను కానీ పదేళ్లుగా ప్రాక్టీస్ లేదు.

కథక్ ఓరియంటెడ్ సినిమా…

మంచి కథ ఉండాలి కానీ కథక్ డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమా చేయాలి అని నాక్కూడా ఉంది. దానికి చాలా డెడికేషన్, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది..

నెక్స్ట్ మూవీస్

వీర భోగ వసంత రాయలు లో ఎయిర్హోస్టెస్ గా నటిస్తున్నాను. ఇంకా కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను.