ఫ్యాన్స్ తో శ్రియ చిట్ చాట్

Thursday,August 24,2017 - 04:24 by Z_CLU

బాలయ్య పైసా వసూల్ లో హీరోయిన్ గా నటించింది శ్రియ శరన్. బాలయ్య సరసన చెన్నకేశవ రెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణీ ఇప్పుడు పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన పైసా వసూల్, బాలయ్య సరసన లక్కీ హీరొయిన్ అనిపించుకున్న శ్రియ, పైసా వసూల్ రికార్డ్ బ్రేకింగ్ హిట్ గ్యారంటీ అని జోష్ ఫుల్ గా ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ఫేస్ బుక్ లో చిట్ చాట్ చేసిన శ్రియ ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

 

బాలయ్యకి అసలు అలసట తెలీదు

బాలయ్య సెట్స్ లో ఉన్నారంటే చేసే సీన్ ఏదైనా, లొకేషన్ ఏదైనా, సిచ్యువేషన్ ఏదైనా ఫుల్ జోష్ ఉంటుంది. ఎంత ట్రిక్కి సిచ్యువేషన్ అయినా ఆయన దగ్గర నవ్వించడానికి ఎప్పుడూ ఒక జోక్ రెడీగా ఉంటుంది. ఎంత యాక్టివ్ గా ఉంటారంటే,అసలాయనకి అలసటన్నదే తెలీదు.

హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది

పైసా వసూల్ సినిమాలో చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కారు చేజింగ్ సీన్ మాత్రం నాకు చాలా ఇష్టం.. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. ఫాస్ట్ గా వెళ్తూ ఎదురుగా వస్తున్న కారు నుండి తప్పించుకోవాలి… బాలయ్య కారు డ్రైవ్ చేశారు.. ఓ మై గాడ్.. అసీన్ తలుచుకుంటుంటే ఇప్పటికీ భయమేస్తుంది.. బట్ స్క్రీన్ పై చూసుకున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది…

 

పోలీసాఫీసర్ గా నటిస్తున్నా…

వచ్చిన అవకాశాల్లోంచి బెస్ట్ నే చూజ్ చేసుకుంటున్నా… గౌతమీపుత్ర శాతకర్ణీ ఇప్పుడు పైసా వసూల్, నెక్స్ట్ తమిళ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నా… మంచి ఆఫర్స్ వస్తున్నాయి.. చాలా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా…

ఈజీ గోయింగ్ డైరెక్టర్

పూరి గారు చాలా ఈజీ గోయింగ్ డైరెక్టర్. చాలా కూల్ గా ఉంటారు. ఈ సినిమాలో బాలయ్యని చాలా డిఫెరెంట్ గా  ప్రెజెంట్ చేశారు. సినిమా బిగినింగ్ నుండి ఎండ్ అయ్యే వరకు ఎవ్రీ ఫ్రేమ్ ఎనర్జిటిక్ గా ఉంటుంది.

సీక్రెట్ అదే…

నిర్మొహమాటంగా తినేస్తాను.. అదే నా ఫిట్ నెస్ సీక్రెట్. కాకపోతే దానికి తగ్గట్టుగా వర్కవుట్ కూడా చేస్తుంటాను.  రెగ్యులర్ గా కథక్ ప్రాక్టీస్ చేయడం ఇప్పటికీ అలవాటు. ఇక మెంటల్ ఫిట్ నెస్ విషయానికి వస్తే ప్రతీది చాలా చాలా పాజిటివ్ గా తీసుకుంటాను.

పైసా వసూల్ లో నా రోల్…

చాలా ఇంటరెస్టింగ్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా చేశాను. చాలా స్టబన్.. దేనికీ భయపడదు.  హీరోకి హీరోయిన్ కి మధ్య ఉండే రిలేషన్ షిప్, ఆ ఇద్దరి ట్రావెల్ చాలా కొత్తగా ఉంటుంది. పైసా వసూల్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అయినా, ఇంటర్నల్ గా బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ట్రావెల్ అవుతూంటుంది.