శ్రద్ధా కపూర్ బర్త్ డే గిఫ్ట్.. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2

Saturday,March 02,2019 - 11:33 by Z_CLU

ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. ఈ భారీ యాక్షన్ విజువల్ ఎంటర్టైనర్లో బాహుబలి ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. యు.వి.క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ నిర్మాత‌లుగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్నాడు.

అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతదేశంలో ఉన్న సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ – 1 పేరిట గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిత్ర బృందం, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ సాహో లో హీరోయిన్ గా నటిస్తున్న శద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో-2ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో – 2 కి సంబంధించిన కౌంట్ డౌన్ టీజర్స్ కి మీడియాలో అటు అభిమానుల్లో ఫుల్ క్రేజ్ లభించింది. హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.