శ్రద్ధా శ్రీనాథ్ ఫ్యూచర్ కనిపిస్తుంది

Saturday,April 13,2019 - 11:03 by Z_CLU

తమిళ, కన్నడ సినిమాల్లో బిజీ హీరోయిన్. అందుకే తెలుగుపై దృష్టి పెట్టింది శ్రద్ధా శ్రీనాథ్. అయితే సాధారణంగా అందరికీ అవకాశం దొరుకుంతుంది. శ్రద్ధా శ్రీనాథ్ కి మాత్రం అదృష్టం దక్కింది. లేకపోతే జస్ట్ డెబ్యూ సినిమాకే ‘జెర్సీ’ లాంటి సినిమా దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకునే విషయమే.

‘జెర్సీ’ లో సారా ఫెర్నాండెజ్ అనే క్యారెక్టర్ లో నాని లవ్ ఇంట్రెస్ట్ గా, వైఫ్ గా ఆల్మోస్ట్ నాని క్యారెక్టర్ తో పాటే ట్రావెల్ చేస్తుంది శ్రద్ధా క్యారెక్టర్. రొమాంటిక్ సీక్వెన్సెస్, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ వగైరా వగైరా ప్రతి కొత్త హీరోయిన్ ప్రిపేర్డ్ గా పాయింట్సే అయినా, ఈ సినిమాలో శ్రద్ధా రీసెంట్ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని, స్ట్రగుల్డ్ వైఫ్ యాంగిల్ లో కనిపించనుంది.

 

జస్ట్ సాంగ్స్ కి పరిమితం కాలేదు శ్రద్ధా ఈ సినిమాలో. క్రికెటర్ గా ప్రూఫ్ చేసుకోవడం అర్జున్ స్ట్రగుల్ ఏరియా అయితే, ఫెయిల్యూర్ హజ్బెండ్, నమ్మిన స్పోర్ట్ లోనే సక్సెస్ చూడాలని తపించే హజ్బెండ్ చుట్టూ, ఎమోషనల్ గా నలిగిపోయే వైఫ్ లా కనిపించనుంది శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో. మొదటి సినిమాకే పర్ఫామెన్స్ కి 100% స్కోప్ ఉన్న రోల్ దొరకడం శ్రద్ధాని, నాని తరవాత అంతే ఫోకస్ లోకి తీసుకు వస్తుంది.

‘జెర్సీ’ కి ముందు టాలీవుడ్ లో శ్రద్ధా అంటే ఎవరో కూడా తెలీదు. కానీ ‘జెర్సీ’ తరవాత ఈ అమ్మడు రేంజ్ మారిపోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో ఏ సినిమాని ఎంచుకోవాలనే తర్జన భర్జనలో శ్రద్ధా, జస్ట్ ‘జెర్సీ’ తోనే టాప్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుందనిపిస్తుంది. ‘జెర్సీ’ చుట్టూ క్రియేట్ అవుతున్న వైబ్స్ చూస్తుంటే శ్రద్ధా ఫ్యూచర్ మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.