తెలుగు నేర్చుకుంటున్న శ్రద్ధాకపూర్

Monday,September 04,2017 - 04:57 by Z_CLU

ప్రభాస్ సాహో షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తెలుగు తమిళ, హిందీ భాషల్లో  తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రద్ధా కపూర్ సీరియస్ గా తెలుగు నేర్చుకునే పనిలో పడింది.

సాహో సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అవుతున్న శ్రద్ధా కపూర్, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. లాంగ్వేజ్ పై పట్టుంటేనే గానీ పర్ ఫెక్ట్ గా పర్ఫామ్ చేయలేనని ఫీల్ అవుతున్న శ్రద్ధా కపూర్ ఈ సినిమా కోసం డెడికేటెడ్ గా ఒక తెలుగు కోచ్ ని అపాయింట్ చేసుకుని మరీ తెలుగు నేర్చుకుంటుంది.

UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు.