మహేష్ సరసన సాహో బ్యూటీ?

Monday,April 20,2020 - 12:16 by Z_CLU

మహేష్ బాబు నెక్ట్స్ మూవీకి కాస్టింగ్ ప్రాసెస్ మొదలైంది. ఇందులో భాగంగా హీరోయిన్ ను ఎవర్ని తీసుకుందామనే చర్చ మొదలైంది. ఇప్పటికే రష్మిక, కీర్తిసురేష్, కియరా అద్వానీ లాంటి పేర్లు వినిపించగా.. తాజాగా శ్రద్ధాకపూర్ పేరు కూడా తెరపైకొచ్చింది.

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది శ్రద్ధాకపూర్. ఆ మూవీ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. మళ్లీ ఇన్నేళ్లకు మహేష్ బాబు సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది శ్రద్ధాకపూర్. హిందీలో ఆమె క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె తెలుగు సినిమాకు కాల్షీట్లు ఇస్తుందా అనేది డౌట్. కాకపోతే మహేష్ మూవీ కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు చాలామంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దీన్ని పాన్-ఇండియన్ మూవీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.