పుకార్లపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్

Saturday,February 03,2018 - 06:01 by Z_CLU

ప్రస్తుతం ప్రభాస్ సరసన సాహో సినిమా చేస్తోంది శ్రద్ధాకపూర్. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్టీఆర్ సరసన మరో సినిమాలో నటించనుందంటూ ఈమధ్య కాలంలో చాలా పుకార్లు వినిపించాయి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఆమెను తీసుకున్నట్టు ప్రచారం బాగా జరిగింది. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చింది శ్రద్ధకపూర్.

ప్రస్తుతం టాలీవుడ్ లో తను సాహో సినిమాకు మాత్రమే కమిట్ అయినట్టు ప్రకటించింది ఈ బ్యూటీ. తెలుగులో మరో సినిమాకు తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, సాహో సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే మరో తెలుగు ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానంటోంది.

త్వరలోనే ప్రభాస్ తో కలిసి దుబాయ్ వెళ్లబోతోంది శ్రద్ధాకపూర్. సాహో సినిమా కోసం అక్కడ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది.