షూటింగ్ అప్ డేట్స్

Monday,July 09,2018 - 01:20 by Z_CLU

 

మహేష్ 25

 సూపర్ స్టార్ మహేష్ బాబు – వంశీ పైడి పల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం డెహ్రా డూన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మహేష్- పూజ హెగ్డే లపై కొన్ని కాలేజీ  సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం మహేష్ -అల్లరి నరేష్ లపై కొన్ని  సీన్స్ షూట్ చేస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 

NTR

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో NTరామారావు గారి బయోపిక్ గా  రూపొందుతున్న ‘NTR’ షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో ఫస్ట్ షెడ్యుల్  జరుపుకుంటుంది. మరో వారం పాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం.

‘F2’

వెంకటేష్ -వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘F2’ ఇటివలే సెట్స్ పైకి వచ్చింది.  ఈరోజే  సినిమా షూటింగ్ లో  జాయిన్ అయ్యాడు వెంకటేష్. నేటి నుండి వరుణ్ తేజ్ , వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే  సీన్స్ షూట్ చేయనున్నారు యూనిట్.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా , మెహ్రీన్ లు హీరోయిన్స్ నటిస్తున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

కళ్యాణ్ రామ్ & గుహన్ మూవీ

సినిమాటోగ్రాఫర్  గుహన్ డైరెక్టర్ గా మారి కళ్యాణ్ రామ్ తో తెరకెక్కిస్తున్న  సినిమా ప్రస్తుతం మణికొండ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా  ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో కళ్యాణ్ రామ్, శాలిని పాండే తో పాటు మరికొంత ఆర్టిస్తులపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్, శాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మహేష్ కోనేరు నిర్మాత. శేకర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

 ‘శైలజా రెడ్డి అల్లుడు’

నాగచైతన్య హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన అను ఇమ్మానుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

 

యాత్ర

మమ్ముట్టీ హీరోగా నటిస్తున్న ‘యాత్ర’ షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫాక్టరీలో జరుగుతుంది. మొన్నటి వరకూ సారధి స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కొన్ని సీన్స్ షూట్ చేసిన  యూనిట్  ప్రస్తుతం మమ్ముట్టీ పై  కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. YSR బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

తేజ – బెల్లం కొండ శ్రీనివాస్ సినిమా 

బెల్లం కొండ శ్రీనివాస్ -తేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నానక్ రాంగూడ రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో నేటి నుండి షూటింగ్ జరుపుకోనుందీ సినిమా. ఈ షెడ్యూల్ లో శ్రీనివాస్,  ఫైటర్స్ తో  ఓ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో  శ్రీనివాస్ సరసన  కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.