టాలీవుడ్ షూటింగ్ అప్ డేట్స్

Thursday,October 05,2017 - 03:17 by Z_CLU

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ త్వరలోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్. మరి మన స్టార్ హీరోలు ప్రస్తుతం వాళ్ళ  అప్ కమింగ్ మూవీస్ ను ఏ స్టేజీ కి తీసుకొచ్చారో తెలుసుకుందాం.


భరత్ అనే నేను :

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ ప్రస్తుతం ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు నాలుగో షెడ్యూల్ జరుపుకుంటుంది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఎసెంబ్లీ సెట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది . డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.


సాహో :

బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ పలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో లో వేసిన స్పెషల్ సెట్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు శ్రద్దాకపూర్ మరియు నీల్ నితిన్ ముకేష్ మరియు  ఇతర ముఖ్య నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు యూనిట్.


నా పేరు సూర్య :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య’ ప్రస్తుతం రెండో షెడ్యూల్ ఊటీలో  జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఊటీలో ఓ భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో మరికొందరు నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు యూనిట్. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మిస్తున్నారు.


రంగస్థలం :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో విల్లేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం1985’. మొన్నటి వరకూ శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి కాస్త గ్యాప్ తీసుకుంది. ఇటివలే గోదావరి తీరా ప్రాంతం తో పాటు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్, భూత్ బంగ్లా లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి ఓ పది రోజులు గ్యాప్ తీసుకొని త్వరలోనే మరో షెడ్యూల్ జరుపుకునుంది. నెక్స్ట్ షెడ్యూల్ లో కొన్ని కీలక సీన్స్ తో పాటు పూజా హెగ్డే పై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించి నవంబర్ కల్లా టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పబోతున్నారు యూనిట్.

 

‘ఉన్నది ఒకటే జిందగీ’ :-

ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ సినిమా ఇటీవలే ఇటలీ లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేసింది యూనిట్. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్స్ లోకి రానుంది. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


తొలి ప్రేమ :

వరుణ్ తేజ్,రాశి ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో క్లీన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘తొలి ప్రేమ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతుంది. లండన్ లో వరుణ్ తేజ్ – రాశి ఖన్నా లపై కొన్ని లవ్ సీన్స్ ను షూట్ చేస్తుంది యూనిట్. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.