షూటింగ్ అప్ డేట్స్(మార్చి 13, 2018)

Tuesday,March 13,2018 - 12:36 by Z_CLU

నేల టిక్కెట్ :

రవితేజ, మాళవిక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నేలటిక్కెట్. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో యాక్షన్ బ్లాక్ షూట్ చేస్తున్నారు. దిలీప్ సుబ్బరాయన్ ఈ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తర్వాత రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మరో ఫైట్ సీక్వెన్స్ తీయబోతున్నారు.

భరత్ అనే నేను :

మహేష్ హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ (సెవెన్ ఏకర్స్) స్టుడియోస్ లో జరుగుతోంది. స్టుడియోలో వేసిన స్పెషల్ సెట్ లో మహేష్-కైరాతో ఓ సాంగ్ సీక్వెన్స్ తీస్తున్నారు. రాజుసుందరం దీనికి కొరియోగ్రాఫర్. ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ కు టోటల్ షూట్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్.

మహానటి :

సావిత్రి బయోపిక్ మహానటి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కీర్తిసురేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామకృష్ణా స్టుడియోస్ లో జరుగుతోంది. రేపట్నుంచి 2 రోజుల పాటు కీర్తిసురేష్, నాగచైతన్య కాంబినేషన్ లో సీన్లు తీస్తారు. మహానటిలో ఏఎన్నార్ పాత్రలో కనిపించబోతున్నాడు చైతూ.

పడి పడి లేచె మనసు :

శర్వానంద్ -సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్ కతాలో జరుగుతోంది.  శర్వా-సాయి పల్లవితో పాటు మరికొందరు ఆర్టిస్టులపై కాంబినేషన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ షెడ్యుల్ ఉంటుంది.

సవ్యసాచి :

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సవ్యసాచి సినిమా షూటింగ్ ప్రస్తుతం కుషాయిగూడ దగ్గర ఓ కాలేజీలో జరుగుతోంది. చైతూ మరికొందరు కమెడియన్స్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చైతూసరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాదికి విడుదల చేస్తారు.

హలో గురు ప్రేమ కోసమేరా :

రామ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాధరావు దర్శకత్వంలో ఈమధ్య ప్రారంభమైన సినిమా హలో గురు ప్రేమకోసమేరా.  నిన్నట్నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్-10 లో షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రామ్-ప్రకాష్ రాజ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాత.

 

కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా :

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యుల్ లో హీరోహీరోయిన్స్ తో పాటు మరికొందరు ఆర్టిస్టులపై షూట్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే నాన్ స్టాప్ షెడ్యుల్ ఇది.