షూటింగ్ అప్ డేట్స్

Sunday,March 15,2020 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


బాలయ్య -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ తీసారు. త్వరలోనే రెండో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తుంది.


నాని ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాలకొల్లులో జరుగుతుంది. తాజాగా రాజమండ్రిలో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన యూనిట్ ప్రస్తుతం పాలకొల్లు సమీపంలో ఉన్న ఓ పల్లెటూరులో నాని, జగపతి బాబులపై సీన్స్ తీస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 3న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.


పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్'(వర్కింగ్ టైటిల్) మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. ముంబైలో నలబై రోజుల పాటు జరిగిన షెడ్యుల్ లో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు విజయ్ -అనన్య పాండేల మీద కీలక సన్నివేశాలు తీసారు. ప్రస్తుతం షార్ట్ బ్రేక్ తీసుకుంటున్న యూనిట్ త్వరలోనే మరో షెడ్యుల్ స్టార్ట్ చేయనున్నారు.


వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న పాటను కాకినాడలో చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ తో టోటల్ షూట్ కి ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చి బాబు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఏప్రిల్ 2 న సినిమా థియేటర్స్ లోకి రానుంది.