షూటింగ్ అప్ డేట్స్

Sunday,February 16,2020 - 11:15 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గోపి కృష్ణ బ్యానర్ పై కృష్ణం రాజు సమర్పిస్తున్న ఈ సినిమాను యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్నారు.


శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి చేరుకున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


గోపీచంద్‌, సంపత్‌నంది కాంబినేషన్ లో రూపొందుతోన్న‌ ‘సీటీమార్‌’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇటివలే రాజమండ్రి షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.


ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నాని ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ పొల్లాచి లో జరుగుతుంది. అక్కడ నాని , మిగతా నటీ నటులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ , ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సన్ స్క్రీన్స్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా జులై లో విడుదల కానుంది.


నాగ శౌర్య , రీతువర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు తీయనున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న “చావుక‌బురు చ‌ల్ల‌గా” సినిమా ఈనెల 19నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత.