షూటింగ్ అప్డేట్స్

Sunday,February 09,2020 - 11:05 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


మెగా స్టార్ , కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కోకాపేట్ లో వేసిన ఓ భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఆ తర్వాత అవుట్ డోర్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే జుబ్లీహిల్స్ లో ఉన్న బూత్ బంగ్లాలో కూడా భారీ సెట్ వేసి మరికొన్ని సీన్స్ తీయబోతున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అలాగే మిగతా నటులపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అక్కినేని నాగార్జున హీరోగా అహితోష్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైం థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 5 నుంచి బ్యాంకాక్ లో జరుగనుంది. అక్కడ ఓ భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యుల్ తో దాదాపు షూట్ పూర్తవుతుంది. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో దియా మిర్జా హీరోయిన్ గా నటిస్తుంది.


నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో జరుగుతుంది. ప్రస్తుతం చైతన్య , సాయి పల్లవి లపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమా రిలీజవుతుంది.


శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకరపల్లిలో జరుగుతుంది. అక్కడ పల్లెటూరి సన్నివేశాలు తీస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది.


నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న “రంగ్ దే” సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకొని భీష్మ ప్రమోషన్స్ పై దృష్టిపెట్టనున్నాడు.


మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ పద్మాలయా స్టూడియోలో జరుగుతుంది. పవన్ సాదినేని డైరెక్షన్ లో గల్లా పద్మ నిర్మిస్తున్న ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.