షూటింగ్ అప్ డేట్స్

Sunday,February 02,2020 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఇటివలే ప్రారంభమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు యూనిట్. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

నాని , శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘టక్ జగదీష్’ సినిమా ఇటివలే లాంచ్ అయింది. ఫిబ్రవరి నుండి పొల్లాచి లో రెగ్యులర్ షెడ్యుల్ మొదలు కానుంది. ఈ సినిమలో నాని సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరి’ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ మ్యూజిక్ కంపోజర్.

సాయి తేజ్ హీరోగా భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతుంది. ఇటివలే తిరుపతి ఓ షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

రామ్ హీరోగా తెరకెక్కుతున్న “రెడ్” సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ అందిస్తున్నాడు.