షూటింగ్ అప్ డేట్స్

Sunday,January 05,2020 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

మెగా స్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న  కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరంజీవిపై  సన్నివేశాలు తీస్తున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్  జరగనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా చిరంజీవిపై కొన్ని సన్నివేశాలతో పాటు.. ఓ సాంగ్ ను కూడా షూట్ చేయాలనుకుంటున్నారు. రీసెంట్ గా మణిశర్మ ఓ ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడు. రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ సాంగ్ లో రెజీనా మెరవనుంది.

జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆర్ ఆర్ ఆర్” సినిమాకు సంబంధించి వైజాగ్ షెడ్యుల్ పూర్తయింది. అరకులో తారక్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీసిన అనంతరం యూనిట్ హైదరాబాద్ వచ్చేసింది.  జనవరి 3నుంచి గండిపేటలో మరో షెడ్యుల్ జరుగనుంది. ఈ షూట్ లో రాంచరణ్ జాయిన్ అవుతారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

నాని ‘V’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసింది. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షనే. ఉగాది కానుకగా మార్చి 25 న రిలీజవుతుందీ సినిమా. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యాజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుధీర్ బాబుగా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరినివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఓ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ససరణ న‌భా న‌టేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి  దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తునాడు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గోపీచంద్‌, సంపత్‌నంది కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. జనవరి 4 నుంచి 25వరకు రాజమండ్రి లో రెండో షెడ్యుల్ జరుగనుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ కనిపించనుంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  ప్రొడక్షన్‌ నెం.3  గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజర్.

నాగచైతన్య – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. త్వరలో ఆర్ముర్ లో యూనిట్ మరో షెడ్యూల్ జరుపనున్నారు.