షూటింగ్ అప్ డేట్స్

Tuesday,October 31,2017 - 12:55 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ స్టార్ మూవీస్ ప్రస్తుతం షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల లేటెస్ట్ స్టేటస్ ఇదే…

 

బాలయ్య – జై సింహా : అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్ లో ఏకంగా 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో ‘’మహాధర్నా’’ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ సీన్ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే బాలకృష్ణ – హరిప్రియ లపై ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు, బాలయ్యపై మరో మాంటేజ్ సాంగ్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేయనున్నారు. వైజాగ్ తో పాటు అరకులోను కొన్ని లొకేషన్స్ లను ఈ షెడ్యూల్ లో లాక్ చేసుకుని పెట్టుకుంది సినిమా యూనిట్.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ : ప్రస్తుతం బల్గేరియాలోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటుంది పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ టీమ్. అనూ ఇమ్మాన్యువెల్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన నుంది. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

నాని – MCA : వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న MCA ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది.  పక్కా షెడ్యూల్స్ ప్రకారం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ మ్యాగ్జిమం డిసెంబర్ 12 కల్లా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

 

సాయి ధరమ్ తేజ్ – వినాయక్ : ప్రస్తుతం మేడ్చల్ కి దగ్గరలో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది వినాయక్ & టీమ్. ఈ షెడ్యూల్ లో సాయిధరమ్ తేజ్ తో పాటు రఘుబాబు మరికొందరు కమెడియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే, డిసెంబర్ 2 నుండి పబ్ సెట్ లో సాంగ్ షూట్ చేయనుంది సినిమా యూనిట్.