షూటింగ్ అప్డేట్స్

Sunday,December 01,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి షెడ్యుల్ నల్లమల అడవుల్లో జరుపుకోనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నితిన్ ,రష్మిక జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో రూపొందుతున్న ‘భీష్మ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.


గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.


రామ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రెడ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ కొంపల్లిలో జరుగుతుంది. రామ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్టైన ‘తడం’ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది మార్చ్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


సాయి తేజ్ – మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ప్రతి రోజు పండగే’ షూటింగ్ పూర్తయింది. ఇటివలే అన్నపూర్ణ స్టూడియోస్ లో సాయి తేజ్ -రాశి ఖన్నా లపై జరిగిన సాంగ్ షూట్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పేసారు యూనిట్. అల్లు అరవింద సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రానుంది.