షూటింగ్ అప్ డేట్స్

Sunday,November 24,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


రవితేజ, మలినేని గోపిచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “క్రాక్” సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.కోలీవుడ్ యాక్ట‌ర్స్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇటివలే లాంచ్ అయిన సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

అల్లు అరవింద్ సమర్పణలో అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం మాదాపూర్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.


బుచ్చి బాబు డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతుంది. దాదాపు ముప్పై రోజులకు పైగా ఈ షెడ్యుల్ జరగనుంది. కాకినాడ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.