షూటింగ్ అప్ డేట్స్

Sunday,October 27,2019 - 10:01 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘జాన్'(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీనికోసం భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో జరిగే షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


మహేష్ బాబు -అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ లో మహేష్ పై కొన్ని సన్నివేశాలు, విజయశాంతిపై మరికొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. టాకీ పూర్తయితే కేవలం సాంగ్స్ మాత్రమే పెండింగ్ లో ఉంటాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి సినిమాకు సంబంధించి టోటల్ షూట్ పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. జనవరి 12న సినిమా థియేటర్లలోకి రాబోతున్నారు.


‘డిస్కోరాజా’కు సంబంధించి మరో భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు రవితేజ. ఐస్ ల్యాండ్ లో ఈ సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఐస్ లాండ్ లోని రెండో అతిపెద్ద ద్వీపంలో ఈ షెడ్యూల్ జరిగింది. తాజా షూట్ తో ‘డిస్కోరాజా’కు సంబంధించి దాదాపు టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. 2 పాటల్ని హైదరాబాద్ లోనే షూట్ చేయబోతున్నారు. మరో పాట కోసం మరోసారి విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకుడు. డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది.

రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమా సెకండ్ షెడ్యూల్‌ హైదరాబాద్ లో జరుగుతుంది. పటాన్ చెరులో ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.


మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న `ఉప్పెన` షూటింగ్ ప్రస్తుతం పూరిలో జరుగుతుంది. ఇదే షెడ్యుల్ లో కోల్‌క‌తా, గ్యాంగ్‌ట‌క్ ప్రాంతాల్లో మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారు. 20 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌ తో మేజర్ పార్ట్ షూట్ పూర్తవుతుందని సమాచారం. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.