షూటింగ్ అప్ డేట్స్

Sunday,October 20,2019 - 10:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఏకర్స్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. మహేష్ ,ప్రకాష్ రాజ్ లపై సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. నవంబర్ లో రెండు పాటలను అన్నపూర్ణ స్టూడియోలో వేసిన 2 సెట్స్ లో మరో పాటను RFC లో వేసిన సెట్ లో ఇంకొ పాటను కేరళలో షూట్ చేయనున్నారు. దీనితో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.


నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఈనెల 21 నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగనుంది. ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా భారీ విలేజ్ సెట్ ను నిర్మించారు. ఆ సెట్ లో దాదాపు పది రోజులకు పైగా షూట్ జరగనుంది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా లోని పాటను అన్నపూర్ణ 7ఏకర్స్ లో వేసిన సెట్ లో తెరకెక్కిస్తున్నారు.

రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. నభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.

నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావ్ హైదరి హీరో హీరోయిన్స్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వీ’ సినిమా షూటింగ్ మనాలిలో జరుగుతుంది.

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న నిర్మిస్తున్న’రంగ్ దే’ సినిమా షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్ లో జరుగుతుంది. పీ.సీ.శ్రీరాం సినిమాటోగ్రఫీ గా పనిచేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

నాగ‌శౌర్య‌, మెహరీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేష‌న్స్‌ బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. మరో వైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా  జరుగుతున్నాయి.

కళ్యాణ్ రామ్ హీరోగా  వేగేశ్న సతీష్ దర్సకత్వం లో ఆదిత్య మ్యూజిక్ పతాకం పై నిర్మిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈనెల 22 వరకూ ఈ షెడ్యుల్ జరుగనుంది. నాలుగవ షెడ్యూల్ కేరళ,కర్ణాటకలో జరుగనుంది. ఈ షెడ్యుల్ తో  షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది.

రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమా సెకండ్ షెడ్యూల్‌ హైదరాబాద్ లో జరుగుతుంది.

కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ’90ml’ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో  50 మంది డాన్సర్లతో 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో హీరోపై  కోకాపేటలో వేసిన సెట్ లో 4  రోజులు పాటను చిత్రీకరించారు. మిగిలిన రెండు పాటలను షూట్  చేయడం కోసం త్వరలోనే  అజర్ బేజాన్ రాజధాని బాకు కి వెళ్లనున్నారు.