షూటింగ్ అప్ డేట్స్

Monday,October 23,2017 - 05:31 by Z_CLU

మోస్ట్ అవేటింగ్ లిస్టులో ఉన్న స్టార్ మూవీస్ ప్రస్తుతం డిఫెరెంట్ డిఫెరెంట్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ వారం బిజీ బిజీగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల వివరాలు ఇవే..  

 

బాలకృష్ణ –  102 మూవీ 

బాలకృష్ణ 102 మూవీ షూటింగ్ ఫాస్ట్ పేజ్ లో కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లలో ఉంది. ప్రస్తుతం K.S. రవి కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజాగ్ లో 20 రోజుల రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇవాళ్టి నుండే బిగిన్ అయిన ఈ షెడ్యూల్ లో, అరకులోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

 

రామ్  చరణ్ –  రంగస్థలం 1985

రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఆది పినిశెట్టి, నరేష్ కాంబినేషన్ లో ఇంటరెస్టింగ్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

మంచు విష్ణు – ఆచారి అమెరికా యాత్ర

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్, మంచి విష్ణు కాంబినేషన్ లో ఇంటరెస్టింగ్ సీన్స్ ని  తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. G. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

అఖిల్ –   ‘హలో ‘ 

అఖిల్ ‘హలో’ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అల్టిమేట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్యంత కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.  ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నాడు.