షూటింగ్ అప్ డేట్స్

Sunday,September 08,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మహేష్ బాబు పై యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.


త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అలా వైకుంఠపురములో’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఓ ఇంట్లో టబుపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. గీతా ఆర్ట్స్ -హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. నివేత పెతురాజ్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వ‌ర్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. బాలయ్య సరసన సోనాల్ చోహన్ , వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


నాని -సుదీర్ బాబు నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వి’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో మొదటి షెడ్యుల్ పూర్తయింది. ఈ నెల 15 న యూనిట్ రెండో షెడ్యుల్ కోసం థాయిలాండ్ వెళ్లనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఆనంద్ దేవరకొండ రెండో సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తయింది. వనస్థలిపురం పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసారు. రెండో షెడ్యుల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో వినోద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.