షూటింగ్ అప్ డేట్స్

Sunday,August 18,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ ఎడేకరాల్లో జరుగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ నెల 23 నుండి మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సీన్స్ తీయనున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తయింది. రామానాయుడు స్టూడియోస్ లో వేసిన సెట్ లో అలాగే కొన్ని లోకేషన్స్ లో కొన్ని సీన్స్ షూట్ చేసారు. నెక్స్ట్ షెడ్యుల్ ఈ నెలాఖరు నుండి రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో జరగనుంది. శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ రెండో షెడ్యుల్ ఈ నెల 19 నుండి మొదలు కానుంది. సారధీ స్టూడియోస్ లో ఈ షెడ్యుల్ కోసం ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ , మోనికా ఓ భారీ సెట్ రెడీ చేసారు. ఈ షెడ్యుల్ లో విజయ్ సేతుపతి , వైష్ణవ్ తేజ్ లపై కొన్ని సీన్స్ తీయనున్నారు.

కార్తికేయ హీరోగా శేఖర్ విఖ్యాత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 90ml(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కొన్ని లోకేషన్స్ లో  కీలక సన్నివేశాలు తీస్తున్నారు. అశోక్ గుమ్మకొండ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ రానుంది.

పీ.వి. గిరి డైరెక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బంగారు బుల్లోడు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ నాలుగు రోజుల పాటు జరగనున్న షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పనున్నారు యూనిట్. అల్లరి నరేష్ సరసన పూజా జావేరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కానుంది.