షూటింగ్ అప్ డేట్స్

Sunday,August 04,2019 - 11:15 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఈ నెల ఆరు నుండి కోకాపేట్ లో జరగనుంది. ఈ షెడ్యుల్ లో మరికొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న థియేటర్స్ లోకి రానుంది.


సూపర్ స్టార్ మహేష్ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో లో జరుగుతుంది. సినిమా కోసం వేసిన ట్రైన్ సెట్ లో మహేష్ , రష్మిక లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ నెల ఎనిమిది వరకూ షూట్ జరగనుంది. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ లో మరి కొన్ని సీన్స్ తీయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో పోర్ట్ ఏరియాలో జరుగుతుంది. ఆగస్ట్ పది వరకూ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.


బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ‘ఆర్ ఎఫ్ సి’లో వేసిన సెట్ లో ఫైట్ షూట్ జరుగుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.


రాజ్ తరుణ్ శాలినీ పాండే జంటగా తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ -శాలినీ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మరో పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యుల్ తో టోటల్ షూట్ కి గుమ్మడికాయ కొట్టనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జి.ఆర్. కృష్ణ దర్శకుడు.