షూటింగ్ అప్ డేట్స్

Monday,October 16,2017 - 06:04 by Z_CLU

పవన్-త్రివిక్రమ్ సినిమా

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా షూటింగ్ చిక్ మగళూరులో జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు సంబంధించి అక్కడ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ అంతా కలిసి యూరోప్ వెళ్లబోతోంది.

 

వీరభోగ వసంతరాయలు

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా వీరభోగ వసంతరాయులు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. క్రైమ్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది.

వినాయక్-సాయిధరమ్ తేజ్

వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు తేజు.

హలో

అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమా షూటింగ్ ఢిల్లీలో కంప్లీట్ అయింది. కేవలం ఒక పాట మినహా షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ఓ సెట్ లో ఈ సాంగ్ తీస్తారు.

సాహో

ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్ సారథి స్టుడియోస్ లో జరుగుతోంది. వచ్చే సోమవారం ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్లబోతోంది.