షూటింగ్ అప్ డేట్స్

Sunday,July 28,2019 - 02:35 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


సూపర్ స్టార్ మహేష్ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. సినిమా కోసం వేసిన ట్రైన్ సెట్ లో మహేష్ . రష్మిక లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ షూట్ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ లో మరి కొన్ని సీన్స్ తీయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. జులై 30 నుండి కాకినాడలో ఓ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్స్ లోకి రానుంది.

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ కి సంబంధించి ఇటివలే రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం సంగారెడ్డి (జిల్లా) లోని నందికంది గ్రామంలో వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే లపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ ఇటివలే హైదరాబాద్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 4 నుండి డిల్లీ లో మరో షెడ్యుల్ జరగనుంది. ఆ తర్వాత సిట్జర్లాండ్ లో ఓ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.