షూటింగ్స్ అప్ డేట్స్

Sunday,July 21,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ కోకాపేటలో జరుగుతుంది. సినిమా కోసం వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 న సినిమా విడుదల కానుంది.

సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కాశ్మీర్ లో మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. ఈ నెల  26 నుండి మరో షెడ్యుల్ మొదలు కానుంది. రెండో షెడ్యుల్ లో  అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన రైల్వే స్టేషన్ సెట్ లో కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర , మహేష్ బాబు కంబైన్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది.


బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. నిన్నటి వరకూ సారధి స్టూడియోలో కొన్ని సీన్స్ తీసారు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.


అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతుంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో కొన్ని సీన్స్ తీస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్స్ లోకి రానుంది.


రవితేజ హీరోగా ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ కి సంబంధించి ఇటివలే తుఫ్రాన్ దగ్గర చందాయిపేటలో కొన్ని సీన్స్ షూట్ చేసారు.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.