షూటింగ్ అప్ డేట్స్

Sunday,July 14,2019 - 11:06 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపుకుంటుంది. ప్రస్తుతం తారక్ తో పాటు చరణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ -రాజేంద్ర ప్రసాద్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ గా కనిపించబోతున్నాడు మహేష్. దిల్ రాజు , అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.


త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం రెండో షెడ్యుల్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

నితిన్ భీష్మ షూటింగ్ హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాల్లో జరుగుతుంది. నితిన్, రష్మిక మిగతా నటీ నటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫస్ట్ షెడ్యుల్ కంప్లీట్ చేసి బ్రేక్ తీసుకునే పనిలో ఉన్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి మ్యూజిక్ అందిస్తున్నాడు.


బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అఖిల్ నటించనున్న సినిమా ఈ నెల 15 నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసేసిన భాస్కర్ ప్రస్తుతం లోకేషన్స్ వెతికే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలు. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజర్.


రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ , హీరోయిన్ శాలినీ పాండే లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.