షూటింగ్ అప్ డేట్స్

Sunday,June 09,2019 - 11:10 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం..


మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పాండిచెర్రిలో మూడు రోజుల పాటు జరగనున్న షూటింగ్ తో ప్యాచ్ మినహా పూర్తి కానుంది. పాండిచెర్రి షెడ్యుల్ జూన్ 10 నుండి మొదలవుతుంది. చిరంజీవి సరసన నయన తార హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న సాంగ్ ని షూట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సెట్ వేసారు. రెండు , మూడు రోజుల పాటు జరగనున్న సాంగ్ షూట్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పనున్నారు యూనిట్. సుజీత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ కూకట్ పల్లి లో జరుగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ , పూజా హెగ్డే , సుశాంత్ , నివేత పెతురాజ్ లపై ఆఫీస్ లో జరిగే సీన్స్ షూట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ , హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సినిమాను దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారు.


వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో రవి తేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రవి తేజ అలాగే మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రవి తేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గోపి చంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి రెండో షెడ్యుల్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పబ్ లో కొన్ని సీన్స్ షూట్ చేస్తోంది యూనిట్. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.


రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా షూటింగ్ చిలుకూరులో షూటింగ్ జరుగుతోంది. అక్కడ రిసార్ట్స్ లో రాజ్ తరుణ్ , షాలినీ పాండేలపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.ఆర్.కృష్ణ దర్శకుడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.